Enter Email,Get updates....

DD SAPTAGIRI 10TH CLASS ONLINE CLASSES


DD SAPTAGIRI 10TH CLASS ONLINE CLASSES

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.... ప్రశ్నాపత్రాల్లో భారీ మార్పులు...?🌺

🌺 ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

🌺పదో తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేస్తోంది.

🌺 రాష్ట్రంలో జులై నెలలో నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ తొలగించాలని నిర్ణయించింది.

🌺గతంలోనే బిట్ పేపర్ ను తొలగిస్తారని వార్తలు వినిపించినా తాజాగా బిట్ పేపర్ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

🌺2019 -2020 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్నల్ మార్కులను, బిట్ పేపర్ ను తొలగిస్తామని ప్రకటించగా... తాజాగా ఆ ఆ మార్పులు అమలయ్యాయి.

🌺కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను పెంచకుండా మార్కుల సంఖ్యను పెంచినట్టు తెలుస్తోంది.

🌺గతంలో పరీక్ష వ్యవధి 2.45 గంటలు కాగా ప్రస్తుతం ప్రభుత్వం 3.15 గంటలకు పరీక్ష వ్యవధిని పెంచింది.

🌺 ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాలను విడుదల చేసింది.

🌺జులై 10వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

🌺ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

🌺ప్రభుత్వం విద్యార్థుల ఇంటికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

🌺లాక్ డౌన్ వల్ల చాలా మంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు.

🌺విద్యార్థులు చదివిన పాఠశాలకు దగ్గరలోనే పరీక్షా కేంద్రం కేటాయిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం విద్యార్థుల ఇళ్లకు దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments