Enter Email,Get updates....

LOCKDOWN 5.0 GUIDELINES



LOCKDOWN 5.0 GUIDELINES CLICK HERE


జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌
కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే

 లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.

ఫేజ్‌-1


* జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి

ఫేజ్‌-2


* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
* విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. 


లాక్‌డౌన్‌ 5.0 వీటికి అనుమతి లేదు.
* మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతివ్వని కేంద్రం
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
* సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు అనుమతివ్వని కేంద్రం
* రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.

Post a Comment

0 Comments