Enter Email,Get updates....

*MDM--నూతన నియమావళి*

*MDM--నూతన నియమావళి*


➡ సిబ్బంది వంట పని ప్రారంభం మొదలు వడ్డించే వరకు పాటించాల్సిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.ఈమేరకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ నవంబర్ 14న జారీ చేసింది.

 ➡పది అంశాలతో కూడిన నిబంధనలు పాటిస్తే పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందించవచ్చని స్పష్టం చేసింది. విద్యాశాఖ విధించిన నిబంధనలను వంట సిబ్బంది విధిగా పాటించేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ డీఈఓలు, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.


🌸 ఇవీ నిబంధనలు...🌸

➡పథకానికి వినియోగించే బియ్యం బస్తాలను వంటగదిలో లేదా భద్రపర్చే గదిలో పరిశుభ్రమైన పరిస్థితులుండేలా చూడాలి.

➡ఆ పరిసరాల్లో కూడా అలాంటి వాతావరణమే ఉండాలి.

➡పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే భోజనం వడ్డించే చోట దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

➡విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్ర పర్చుకునేందుకు సబ్బు నీళ్లు, సబ్బులు, హ్యాండ్ వాష్ ద్రవాలను అందుబాటులో ఉంచాలి.

➡బియ్యం, పప్పు తదితర నిల్వలను ఎలాంటి క్రిమి కీటకాలు చొరబడకుండా భద్రపర్చాలి.

➡ఇరుకుగదుల్లో, బాగా చీకటి గదులు, ఎక్కువ రోజులు వినియోగించని గదుల్లో బియ్యం, పప్పు తదితరాలను నిల్వ చేయరాదు.
ప్రామాణిక కార్యాచరణ తప్పకుండా పాటించాలి.
వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు ఆ సిబ్బంది తప్పకుండా తలకు క్యాప్‌లు, చేతులకు గ్లౌజ్‌లు, ఆప్రాన్‌స (తెల్ల కోటు) విధిగా ధరించాలి.

➡వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పాఠశాల హెచ్‌ఎంలు వారికి అవగాహన కల్పించి చైతన్యపర్చాలి.
మధ్యాహ్న భోజనం, తాగునీరు కల్తీ జరగకుండా తరచుగా మైక్రోస్కోప్ ద్వారా పరీక్షలు చేయించాలి.

Post a Comment

0 Comments